Thursday, January 23, 2025

జెఇఇ మెయిన్స్ అడ్మిట్ విడుదల

- Advertisement -
- Advertisement -

మన ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జెఇఇ మెయిన్ 2023 అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏ జెన్సీ విడుదల చేసింది. తొలుత జ నవరి 24వ తేదీ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో ఉం చింది. 25వ తేదీ పరీక్షకు సంబంధించిన అ డ్మిట్ కార్డులను ఆదివారం (జనవరి 22) వి డుదల చేయనుంది. మిగిలిన తేదీల్లో పరీక్షల అడ్మిట్ కార్డులను వరుసగా విడుదల చేయనున్నట్లు ఎన్‌టిఎ తెలిపింది. ఎన్‌టిఎ ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24, 25, 27, 28, 29, 30, 31 తేదీలలో ప రీక్షలను నిర్వహించనున్నట్లు తెలపగా, ఇటీవల షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసింది. బిఇ, బి.టెక్ విభాగాల్లో జెఇఇ మెయిన్ తొలి విడత పరీక్ష (పేపర్ 1, రెండు షిఫ్టుల్లో) ఈ నెల 24, 25, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో నిర్వహించనున్నట్టు తెలిపింది.

అలాగే, ఈ నెల 28న బి.ఆర్క్, బి.ప్లానింగ్ విభాగంలో పేపర్ -2ఎ, 2బి పరీక్ష మధ్యాహ్నం షిఫ్ట్ జరుగుతుందని పేర్కొంది. ఇప్పటికే పరీక్షలు జరిగే నగరాల వివరాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తంగా 290 నగరాల్లో, దేశం వెలుపలి 25 నగరాల్లో జెఇఇ మెయిన్ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు ఎన్‌టిఎ స్పష్టం చేసింది. దేశంలోని ట్రిపుల్ ఐటీలు, ఎన్‌ఐటీ, ఇతర విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహిస్తున్న జెఇఇ మెయిన్ పరీక్షలను దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు రాస్తుంటారు. మెయిన్‌లో అర్హత సాధించిన 2.50 లక్షల మంది విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ నిర్వహిస్తారు. అందులో వచ్చే ర్యాంకు ఆధారంగా ఐఐటిలలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది జెఇఇ మెయిన్ పరీక్షలను రెండు విడతల్లో నిర్వహిస్తున్న ఎన్‌టిఎ, రెండో విడత పరీక్షలను ఏప్రిల్‌లో నిర్వహించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News