Wednesday, January 22, 2025

జీడిమెట్లలో నవ వధువు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

జీడిమెట్ల: మేడ్చల్ జిల్లా జీడిమెట్ల ప్రాంతం చింతల్ లోని శ్రీసాయి నగర్ లో దారుణం చోటుచేసుకుంది. గురువారం ఉదయం నవ వధువు శైలజ రెండో అంతస్తు నుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నవవదువు ఆత్మహత్య పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  20 రోజుల క్రితమే పెళ్లి అయినట్లు గుర్తించారు. భార్య భర్తలు మధ్య గొడవతో తీవ్ర మనస్తాపం చెందిన నవవధువు ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా భవనం పైనుంచి ఆమెను తోసేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News