Thursday, January 23, 2025

జీడిమెట్లలో వృద్ధురాలు హత్య…. కుమారుడిపై అనుమానం?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్దురాలి హత్యకు గురయ్యాడు. కుత్బుల్లాపూర్ గ్రామంలో నివాసముండే యాదమ్మ(64) ను తన ఇంట్లోనే ఆమె తలపై గుర్తు తెలియని వ్యక్తి బండరాయితో కొట్టి హత్య చేశాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యాదమ్మ కుమారుడు వేణునే హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నామని జీడిమెట్ల పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News