Monday, December 23, 2024

మధ్యప్రదేశ్‌లో ట్రక్కును ఢీకొన్న జీపు.. నలుగురు విద్యార్థుల మృతి

- Advertisement -
- Advertisement -

Jeep collided with a truck in Madhya Pradesh: Four students killed

ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో సోమవారం పాఠశాలకు వెళుతున్న ఒక జీపు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొన్న ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మరణించగా మరో 11 మంది గాయపడ్డారు. ఉన్హెల్ పట్టణంలోని జిర్నియా ఫతా సమీపంలో ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. నాగ్డాలోని ఫాతీమా కాన్వెంట్ స్కూలుకు విద్యార్థులు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు జిల్లా ఎస్‌పి సత్యేంద్ర శుక్లా తెలిపారు. గాయపడిన విద్యార్థులు జిపులో చిక్కుకుపోగా పోలీసులు, స్థానికులు తీవ్రంగా శ్రమించి వారిని వెలికితీసి ఆసుపత్రికి తరలించినట్లు ఆయన చెప్పారు. మరణించిన విద్యార్థుల వయసు 6 నుంచి 18 లోపు ఉంటుందని ఆయన తెలిపారు. ట్రక్కు, జీపు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సంఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ సానుభూతి తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News