Monday, December 23, 2024

ట్రక్కును ఢీకొట్టిన జీపు.. ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

పటన్(గుజరాత్): గుజరాత్ పటన్ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం స్టేషనరీ ట్రక్కుకు వెనుక నుంచి జీపు ఢీకొని ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు మహిళలు ఉన్నారు. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. జీపు వరాహి గ్రామానికి వెళ్తుండగా, రాథన్‌పూర్ సమీపాన ఈ ప్రమాదం జరిగింది.

15 మంది ప్రయాణికులతో వస్తున్న మహీంద్ర జీపు టైరు పంక్చరు కావడంతో అదుపు తప్పి ట్రక్కుకు ఢీకొందని డిఎస్‌పి కెకె పాండ్యా వెల్లడించారు. మృతులు సంజుభాయ్ ఫుల్వాడీ (50), డూడా భాయి రథోడ్ (50), రాధాబెన్ పర్మార్ (35), కాజల్ పర్మార్ (59), అమృత వంజారా (15), పినల్‌బెన్ వంజారా (7) గా గుర్తించారు. గాయపడిన వారిని రాథన్ పూర్, పటన్ ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News