హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్‌లోని జలదపర నేషనల్ పార్క్‌లో ఆరుగురు పర్యాటకులతో ప్రయాణిస్తున్న జీపు బోల్తా పడింది. జంగిల్ సఫారీ చేస్తున్న పర్యాటకుల వాహనంపైకి ఖడ్గ మృగం దూసుకురావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి ఆకాష్ దీప్ భదవాన్ ట్విట్టర్‌లో షేర్ చేయగా 2 లక్షల మందిపైగా వీక్షించారు. 24 సెకండ్ల వ్యవధి కలిగిన ఈ వీడియోలో జీప్‌లో ఉన్న పర్యాటకులు ఖడ్గమృగం ఫొటోలను తీస్తుండగా అనూహ్యంగా వారి వాహనాన్ని వెంబడించడంతో…
డ్రైవర్ వెను వెంటనే రివర్స్ చేసేందుకు ప్రయత్నించగా వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కగా దూసుకెళ్లి బోల్తా పడటం కనిపిస్తుంది. జీపు వెనుక ఉన్న వాహనంలోని పర్యాటకులు ఈ మొత్తం ఘటనను కెమెరాలో రికార్డు చేశారు. దేశవ్యాప్తంగా వన్యప్రాణి కేంద్రాల్లో భద్రత, సహాయ కార్యక్రమాలకు మార్గదర్శకాలను నిర్ధేశించాల్సిన సమయం ఇదే.. సఫారీలు అడ్వంచర్ స్పోర్ట్‌గా మారాయి.. జలదపరలో ఇలాంటి అనుభవమే ఎదురైంది! అని ట్వీట్ చేశారు.