- Advertisement -
హైదరాబాద్: బిఆర్‌ఎస్‌కు ఇంకా జ్ఞానోదయం కలగలేదని కాంగ్రెస్ ఎంఎల్‌సి జీవన్ రెడ్డి మండిపడ్డారు. మిషన్ భగీరథ పెద్ద కుంభకోణం అని మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బిఆర్‌ఎస్ ప్రచారం చేసుకోవడం తప్ప ఎక్కడా అభివృద్ధి చేయలేదని ధ్వజమెత్తారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆత్మస్తుతి, పరనింద నుంచి బయటకు రావాలని లేకపోతే పార్లమెంట్ ఎన్నికలలో ఓటమి ఖాయమని విమర్శించారు. బిఆర్ఎస్ మిత్రపక్షంగా భావించే రాజకీయ పార్టీ పక్కలో బల్లెంలా వేచిచూస్తోందని చురకలంటించారు. ఇప్పటికైనా తెలుసుకొని వాస్తవాలకు అనుగుణంగా వ్యవహరించి ప్రతిపక్ష స్థానంలో నిలబెట్టుకోవాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికలలో తప్పుడు ప్రచారంతోనే బిఆర్ఎస్ కు ఓట్లు పడ్డాయన్నారు.
- Advertisement -