Friday, January 17, 2025

రైతు కూలీలకు 12 వేలు: జీవన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రజల దృష్టిని మళ్లించడానికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎత్తుగడలు వేస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మండిపడ్డారు. బిఆర్ఎస్ పోరాటం చేయడంతోనే కాంగ్రెస్ రైతుభరోసా ఇచ్చిందని చెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చురకలంటించారు. అందుకే బిఆర్ఎస్ నేతలు రైతు దీక్ష చేపట్టారని దుయ్యబట్టారు. రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ పాటుపడుతోందని, ఈ నెల 26 నుంచి రైతు భరోసా అమలు చేస్తామని స్పష్టం చేశారు. రైతు కూలీలకు ఆత్మీయ భరోసా కింద రూ.12 వేలు ఇస్తామని జీవన్‌రెడ్డి తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News