Sunday, December 22, 2024

24 గంటల కాదు 13 గంటల కరెంటైనా ఇవ్వండి: జీవన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: 24 గంటల కరెంటు అనేది అధికార పార్టీ వారికి ఊతపదమైందని కాంగ్రెస్ ఎంఎల్‌సి జీవన్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ అవరణంలోని మీడియా పాయింట్ వద్ద జీవన్ రెడ్డి మాట్లాడారు. అధికార పక్ష నేతలు సమస్యలపై చర్చలు జరపడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయని, కనీసం 8, 9 గంటల కరెంటు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్టు సభలో అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. రైతులు సబ్‌స్టేషన్ల మందు ధర్నాటు చేస్తున్నారని విరుచుకపడ్డారు. కళ్లు ఉండి చూడలేని కబోదిలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. 13 గంటల కరెంటు ఇచ్చి రైతుల కాపాడాలని డిమాండ్ చేశారు. టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు కంటి వెలుగు కంటి పరీక్షలు చేసుకొని కరెంటు కోతల గురించి మాట్లాడాలని జీవన్ రెడ్డి సూచించారు. ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అధికార పక్షం ఎంఎల్‌ఎలు, మంత్రుల ప్రసంగాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. శాసన మండలిలో వాయిదా తీర్మానం ఇచ్చిన కూడా తిరస్కరించారని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News