- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాల గురించి ఎంఎల్‌సి జీవన్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేసారు. పిసిసి చీఫ్ అనే పదవిలో ఉన్నవారు కేవలం సమన్వయకర్తలు మాత్రమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. తామంతా సోనియా నాయకత్వంలో పని చేస్తున్నామని, అందరినీ సంతృప్తి పరచడం ఎవరి వల్లా కాదని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తన పరిధి మేరకు పని చేస్తున్నాదాని ఈ సందర్భంగా తెలిపారు. రేవంత్‌కి వెంకట్ రెడ్డికి మధ్య ఏం జరుగుతుందో తనకు తెలియదని, కానీ దాసోజు శ్రవణ్ పార్టీని వీడటం బాధాకరమని ఆయన అభిప్రాయపడ్డారు. మునుగోడు ఉప ఎన్నిక గురించి మాట్లాడుతూ… హుజురాబాద్, మునుగోడులను రెండూ ఒకేలా చూడలేమని, మునుగోడు తమ సిట్టింగ్ సీట్ అని ఆయన అన్నారు.
Jeevan Reddy reacts on Dasoju Sravan Resign
- Advertisement -