Sunday, November 24, 2024

కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్సీ పదవి నాకు ఎందుకు: జీవన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ‘గత కొన్ని సంవత్సరాల నుంచి ఎవరి మీద కొట్లాడానో, వారినే నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడం మంచిది కాదు’ అని కాంగ్రెస్ ఎంఎల్ సి జీవన్ రెడ్డి మండిపడ్డారు. జగిత్యాల బిఆర్ఎస్ ఎంఎల్ఎ సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుంది ఇప్పుడు పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూసి కాంగ్రెస్ కార్యకర్తలు మనస్తాపానికి గురై బాధ పడుతున్నారన్నారు. సోమవారం ఉదయం పత్రికల్లో చూసి జగత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరిన వార్త తెలుసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు.

40 ఏళ్ల తన సీనియారిటీకి అధిష్టానం ఇచ్చే గౌరవం ఇదేనా ధ్వజమెత్తారు. ఇంకా తనకు కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్సీ పదవి ఎందుకు అని ప్రశ్నించారు. శాసనసభలో సంఖ్యా బలం పెంచుకోవడం కోసం ఏకపక్షంగా ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నామని చెప్పడం సరికాదన్నారు. కానీ ఆ చేరిక అనేది ఆ ప్రాంత కార్యకర్తల మనోభావాలు గౌరవించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని హితువు పలికారు. జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి మంత్రి శ్రీధర్ బాబు బుజ్జగించారు. కాంగ్రెస్ పార్టీకి జీవన్ చేసిన సేవలు వెలకట్టలేనివని, జీవన్ రెడ్డికి న్యాయం జరిగేలా సిఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇన్ ఛార్జీ దీపాదాస్ మున్షీ దృష్టికి తీసుకెళ్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News