Thursday, January 23, 2025

రావాలి కెసిఆర్.. కావాలి కెసిఆర్.. గెలవాలి కెసిఆర్: జీవన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Jeevan reddy want to CM KCR enter into National Politics

హైదరాబాద్: మునుగోడు సభ నుంచి నిజామాబాద్ సభ దాకా ప్రజలు సిఎం కెసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని కోరుకున్నారని నిజామాబాద్ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షుడు ఎ జీవన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ భవన్ నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. అసాధారణ వనరులున్న దేశానికి అసాధారణ తెలివి తేటలున్న కెసిఆర్ నాయకత్వం దేశానికి కావాలని పిలుపునిచ్చారు. కెసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని తాము ముక్త కంఠంతో కోరుకుంటున్నామన్నారు. రావాలి కెసిఆర్.. కావాలి కెసిఆర్.. గెలవాలి కెసిఆర్ జీవన్ పిలుపునిచ్చారు. జాతీయ సంపదను పేదలకు పంచి పెట్టాలంటే కెసిఆర్ దేశానికి కావాలని, తెలంగాణ పథకాలు దేశ లో కావాలంటే కెసిఆర్ రావాలన్నారు. రైతులకు ఉచిత కరెంటు కెసిఆర్ తోనే సాధ్యమని, దేశం కెసిఆర్ నాయకత్వాన్ని కోరుకుంటుందన్నారు. సంఖ్యా బలం ముఖ్యం కాదని, సంకల్ప బలం ముఖ్యమని, తెలంగాణ ఉద్యమం కెసిఆర్ సంకల్పంతో మొదలైందని, ఇపుడు దేశ పునర్నిర్మాణం కెసిఆర్ సంకల్పంతోనే సాధ్యమన్నారు. దేశ సంపదను తుంచే మోడల్ మోడీదని, పెంచే మోడల్ కెసిఆర్ దని, కెసిఆర్ తెలివి తేటలు తెలంగాణకే పరిమితం కాకూడదని జీవన్ రెడ్డి సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News