హైదరాబాద్: నరేష్‌తో ఎందుకు విభేదాలు వచ్చాయో స్పష్టత ఇవ్వాలని అనుకుంటున్నాని నటి జీవిత రాజశేఖర్ తెలిపింది. ఇటీవల నటుడు నరేష్ బయటకు వచ్చి మాట్లాడినందుకు తాను ఇప్పుడు మాట్లాడుతున్నానని జీవిత పెదవి విప్పారు. ఇళ్లు కట్టిస్తామంటే తాను ఏమైనా ఇసుక, సిమెంట్ ఎత్తుకెళ్లానా? అని మండిపడ్డారు. నరేష్ అందరినీ కలుపుకోకపోవడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. ఫారిన్లో ఈవెంట్‌పై విభేదాలు వచ్చిన వారితోనే నరేష్ మళ్లీ ఎందుకు ప్రోగ్రామ్ చేయాలనుకున్నారని ప్రశ్నించారు. ఏమి తప్పు చేశానని తనని ఎందుకు టార్గెట్ చేశారని నిలదీశారు. ఒక్కసారి ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టాలని ఎంత కోరినా గతంలో నరేష్ వినలేదని, జనరల్ బాడీ మీటింగ్ పెడితే తనని దింపేస్తారని అతడు అపోహ పడ్డారన్నారు.
పెన్షన్ ఇవ్వకపోవడానికి జీవిత సంతకం చేయలేదని నరేష్ అంటారా? అని మండిపడ్డారు. బండ్ల గణేష్ తనపై ఆరోపణలు చేశారు కాబట్టే ఆయన గురించి మాట్లాడానని వివరణ ఇచ్చారు. పృథ్వీ కూడా తనపై ఆరోపణలు చేశారన్నారు. పృథ్వీ చేసిన ఆరోపణలు కూడా హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు డైరీ లాంఛ్ గ్రాండ్‌గా చేయొద్దని కోరినా నరేష్ వినలేదని, డైరీ లాంఛ్‌లో రాజశేఖర్ మాట్లాడిన దాంట్లో తప్పేమి లేదని జీవిత స్పష్టం చేశారు. ఆ రోజు రాజశేఖర్ చేసింది తప్పు అన్నట్లుగా చేశారని జీవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచి చేద్దామని ప్రయత్నించి తాను, రాజశేఖర్ పిచ్చోళ్లము అయ్యామన్నారు. రెండు గ్రూప్‌లను సమన్వయం చేసుకుంటూ తాను ముందుకెళ్లానన్నారు.