Wednesday, January 22, 2025

జీవితారాజశేఖర్‌కు సైబర్ నేరగాళ్ల టోపీ

- Advertisement -
- Advertisement -
జియో బహుమతుల పేరుతో మోసం
రూ.1.50 లక్షలు పంపిన మేనేజర్
సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్: జియో బహుమతుల పేరుతో సినీనటులు జీవితారాజశేఖర్‌కు సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపీ పెట్టారు. సగం ధరకే జియో బహుమతులు ఇస్తామని చెప్పిన నిందితులు వారికి తెలిసిన వారి పేరు చెప్పడంతో జీవితారాజేఖర్ నమ్మారు. దీంతో వారి మేనేజర్ సైబర్ నేరస్థులు చెప్పిన ఖాతాకు రూ.1.5లక్షలు పంపించారు.

డబ్బులు పంపించిన తర్వాత నుంచి నిందితుల మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో తాము మోసపోయామని గ్రహించారు. వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు చెన్నైకి చెందిన నరేష్ నేరం చేసినట్లు గుర్తించారు. వెంటనే నిందితుడిని అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకుని వచ్చారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News