Monday, December 23, 2024

హృదయం ఉన్న ప్రతి ఒక్కరికీ నచ్చే సినిమా..

- Advertisement -
- Advertisement -

Jeevitha Rajasekhar press meet about Shekhar Movie

కొన్ని పరిస్థితుల వలన దర్శకురాలు అయ్యాను తప్ప నిజానికి నాకు డైరెక్షన్ చేయాలనే జీల్ ఎప్పుడూ లేదు అన్నారు దర్శకురాలు జీవిత రాజశేఖర్. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై డా. రాజశేఖర్ హీరోగా, జీవిత రాజశేఖర్ దర్శకత్వంలో బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గ రం సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘శేఖర్’. ఈ చిత్రా న్ని వెంకట సాయి ఫిల్మ్ బ్యానర్‌లో ముత్యాల రాందాస్ గారు ఇండియా వైడ్ విడుదల చేస్తుండగా నిర్వాణ సినిమాస్ సృజన ఎరబోలు ఓవర్సీస్‌లో విడుదల చేస్తున్నా రు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈనెల 20న విడుదలవుతున్న సందర్భంగా దర్శకురాలు జీవిత రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ… మలయాళంలో హిట్ అయిన జోసెఫ్ సినిమా మాకు నచ్చడంతో తెలు గు రైట్స్ తీసుకోవడం జరిగింది.

ఈ సినిమాను ‘శేఖర్‘ పేరుతో తీయాలని పలాస డైరెక్టర్, నీలకంఠను కలవ డం జరిగింది. వారు బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా కూడా నేనే దర్శకురాలిగా చేయడం జరిగింది. చాలా రియలిస్టిక్‌గా తీసిన ‘శేఖర్‘ సినిమా ఎవరు ఉహించని విధంగా ఉంటుంది. ఇందులో రాజశేఖర్ లుక్‌కు మంచి ప్రశంస వచ్చింది. ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టు చిన్న చిన్న మార్పులు చేయడం జరిగింది, అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ప్రతి వ్యక్తి జీవితంలో మనకు చాలా ఇష్టపడే వ్యక్తి ఒకరు ఉంటారు. వారు తల్లి, తండ్రి, అక్క, చెల్లి, అన్నా ఇలా ఎవరైనా ఆవ్వచ్చు అటువంటివారెవరూ లేకుండా సింగల్‌గా మిగిలి పోతే తన మైండ్, ఎమోషన్ ఎలా ఉంటుంది. తన పక్కన ఎవరూ లేకున్నా ఒక కామన్‌గా తనకు ఒక సమస్య వస్తే దాన్ని ఎలా పరిష్కరించుకున్నాడు అనేదే శేఖర్ సినిమా. హృదయం ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ‘శేఖర్‘ ఉంటాడు అనేలా ఈ సినిమా కనెక్ట్ అవుతుందన్నారు.

Jeevitha Rajasekhar press meet about Shekhar Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News