Monday, December 23, 2024

బిజెపి ఎంపీ అభ్యర్థిగా జీవిత?

- Advertisement -
- Advertisement -
Jeevitha Rajasekhar Not To Repeat 'Jagan' Mistake In BJP
జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం

హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో అధికారాన్ని చేపట్టాలనే పట్టుదలతో బిజెపి ఉంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రులు, కీలకమైన నాయకులు తరచుగా తెలంగాణకు వస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర నాలుగో విడత కూడా పూర్తయింది.

మరోవైపు సినీ స్టార్లతో కూడా బిజెపి పెద్దలు సమావేశమవుతూ పార్టీకి గ్లామర్ తీసుకొస్తున్నారు. సినీ నటి జీవిత ఇటీవలే బిజెపిలో చేరింది. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికర వార్త వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి జీవిత పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన బిజెపి అభ్యర్థి బాణాల లక్ష్మారెడ్డి 1,38,947 ఓట్లను సాధించి మూడో స్థానంలో నిలిచారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News