Monday, January 20, 2025

మస్క్‌ను వెనక్కినెట్టిన బెజోస్

- Advertisement -
- Advertisement -

ప్రపంచ కుబేరుడిగా అమెజాన్ వ్యవస్థాపకుడు
11వ స్థానంలో ముకేశ్ అంబానీ

న్యూయార్క్ : టెస్లా సిఇఒ ఎలోన్ మస్క్‌ను వెనక్కినెట్టి ఇప్పుడు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ లిస్ట్ ప్రకారం, జెఫ్ బెజోస్, మస్క్‌ను అధిగమించి మొదటి స్థానానికి చేరుకున్నాడు. దీనికి కారణం మస్క్ కంపెనీ టెస్లా షేర్ల పతనమే కారణం, స్టాక్స్ నష్టపోవడంతో ఆయన నికర విలువ తగ్గింది.

మస్క్ కంపెనీ టెస్లా స్టాక్ ఈ ఏడాదిలో ఇప్పటివరకు 24 శాతానికి పైగా క్షీణించింది. జెఫ్ బెజోస్ నికర విలువ ఇప్పుడు 200 బిలియన్ డాలర్లు (రూ. 16.58 లక్షల కోట్లు), ఎలాన్ మస్క్ నికర విలువ 198 బిలియన్ డాలర్లు (రూ. 16.41 లక్షల కోట్లు)గా ఉంది. ఎల్‌విఎంహెచ్ అయిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ 197 బిలియన్ డాలర్ల (రూ. 16.33 లక్షల కోట్లు) నికర విలువతో మూడవ స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో టాప్ 10లో భారత్‌కు చెందిన ఏ బిలియనీర్ కూడా చేరలేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ 115 బిలియన్ డాలర్ల (రూ. 9.53 లక్షల కోట్లు) సంపదతో 11వ స్థానంలో ఉన్నారు. కాగా ఈ జాబితాలో గౌతమ్ అదానీ 12వ స్థానంలో ఉన్నారు. ఆయన నికర విలువ 104 బిలియన్ డాలర్లు (8.62 లక్షల కోట్ల రూపాయలు)గా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News