Wednesday, January 22, 2025

సిద్ధనాథ్ ఆలయంలో తొక్కిసలాట: ఏడుగురు మృతి

- Advertisement -
- Advertisement -

పాట్నా: సిద్ధనాథ్ ఆలయంలో తొక్కిసలాట జరిగి ఏడుగురు భక్తులు మృతి చెందిన సంఘటన బిహార్‌లోని జెహానాబాద్ జిల్లా మగ్ధుంపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సిద్ధనాథ్ ఆలయంలో పూజా కార్యక్రమాలు జరుగుతుండగా భక్తులు తండోపతండాలుగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జెహానాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. జెహానాబాద్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అలంకృత పాండే ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News