Saturday, January 11, 2025

ప్రాణాలు తీసిన స్కూలు లిఫ్ట్

- Advertisement -
- Advertisement -

Jenel Fernandes local private teacher, died in an accident in lift

ముంబైలో ఓ లేడీ టీచరు విషాదాంతం

ముంబై : స్థానిక ప్రైవేటు టీచరు జెనెల్ ఫెర్నాండెజ్ (26) ఓ లిఫ్ట్‌లో ఇరుకున్న దుర్ఘటనలో మృతి చెందారు. నార్త్ ముంబైలోని శివార్లలో ఉన్న మలాద్ ప్రాంతంలోని చించోలి బందర్‌లో ఉన్న సెయింట్ మేరీస్ ఇంగ్లీషు స్కూల్ లిఫ్ట్ ఆమె ప్రాణాలను తీసింది. శుక్రవారం మధ్యాహ్నం ఆమె ఆరవ ఫ్లోర్ నుంచి లిఫ్ట్‌లో రెండో ఫ్లోర్‌లోని స్టాఫ్ రూంకు వెళ్లేందుకు లిఫ్ట్ తీసుకుని వెళ్లింది. వెంటనే లిఫ్ట్ తలుపులు పడిపోవడం, లిఫ్ట్ వేగంగా కదలడం వంటి ఘటనల మధ్య ఆమె లోపల చిక్కుపడిందని కేకలు పెడుతూ ఉండటంతో సిబ్బంది అక్కడికి వచ్చి ,ఆమెను బయటకు లాగారు. అప్పటికే ఆమె శరీరం అంతా గాయాలపాలయింది. వెంటనే ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా , ఆమె అప్పటికే చనిపోయి ఉన్నట్లు డాక్టర్లు నిర్థారించారు. ఇది ప్రమాదమే అని భావిస్తున్నామని, దర్యాప్తు సాగుతోందని, ఏదైనా ఇతర కారణం ఉంటే అందుకు అనుగుణంగా స్పందిస్తామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News