Monday, December 23, 2024

బికినీ వేసుకున్నా అసభ్యత అనిపించదు

- Advertisement -
- Advertisement -

ఉదయ్ శంకర్, జెన్నిఫర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘నచ్చింది గాళ్ ఫ్రెండూ’. ఈ చిత్రాన్ని శ్రీరామ్ ఆర్ట్ పతాకంపై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్నారు. దర్శకుడు గురు పవన్ తెరకెక్కిస్తున్నారు. లవ్, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సినిమా గురించి హీరోయిన్ జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో నేను సంధ్య అనే క్యారెక్టర్‌లో నటిస్తున్నాను. శాండీ అని పిలుస్తుంటారు. ఈ పాత్రకు రెండు భిన్నమైన షేడ్స్ ఉంటాయి. కొద్ది సేపు గ్రే షేడ్ క్యారెక్టర్‌లా అనిపిస్తుంటుంది. నా క్యారెక్టర్ వరకు ఒక మంచి ట్వస్ట్ కూడా ఉంటుంది.

ఈ కథ విన్నప్పుడు తర్వాత సన్నివేశం ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి కలిగింది. కథతో పాటు నా క్యారెక్టర్ చాలా బాగుండటంతో సినిమాను సంతోషంగా ఒప్పుకున్నాను. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో బికినీ ధరించాను. బికినీ వేసుకున్నా…దర్శకుడు నన్ను అందంగా చూపించారు గానీ అసభ్యత అనిపించదు. ఈ సీన్ కోసం రెండు రోజులు చాలా తక్కువగా ఫుడ్ తీసుకున్నాను. ఈ సినిమాలోని ప్రధాన ఇతివృత్తానికి అన్ని ప్రధాన పాత్రలకు సంబంధం ఉంటుంది. ఒక వైపు ప్రేమ కథ సాగుతూనే థ్రిల్లర్ ఎలిమెంట్స్ అండర్ కరెంట్‌గా ఉంటాయి. – హీరో ఉదయ్ శంకర్‌తో కలిసి నటించడం ఆనందంగా అనిపించింది. ఈ చిత్రంతో ఒక కొత్త తరహా ప్రయత్నం చేశాం. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను”అని అన్నారు.

Jennifer Emmanuel about ‘Nachindi Girlfriend’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News