Saturday, November 23, 2024

తలకు బలంగా తగిలిన బంతి.. మైదానంలోనే కుప్పకూలిన విండీస్ క్రికెటర్

- Advertisement -
- Advertisement -

Jeremy Solozano was unexpectedly injured

 

గాలె: వెస్టిండీస్‌శ్రీలంక మధ్య ఇక్కడ జరుగుతున్న తొలిక్రికెట్ టెస్టులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. విండీస్ క్రికెటర్ జెరెమీ సోలోజానో అనూహ్య రీతిలో గాయపడ్డాడు. ఆట తొలి సెషన్ 24వ ఓవర్‌లో ఇది చోటు చేసుకుంది. రోస్టర్ చేజ్ వేసిన షార్ట్ పిచ్ బంతిని శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణ రత్నె షార్ట్‌లెగ్ దిశగా ఆడాడు. అయితే అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న సోలోజానో హెల్మెట్‌కు తాకింది. అయితే షాట్ పవర్‌ఫుల్ కావడంతో హెల్మెట్ గ్రిల్ అదిరి తలకు బలంగా తాకింది. దీంతో సోలోజానో ఫీల్డ్‌లోనే కింద పడిపోయి నొప్పితో విలవిలలాడాడు. కాస్సేపటికి ఫిజియో వచ్చి అతడ్ని పరీక్షించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా సోలోజానోకు టెస్టుల్లో ఇది డెబ్యూ మ్యాచ్ కావడం విశేషం. ఈ ఘటనతో అటు విండీస్, ఇటు లంక క్రికెటర్లు ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం సోలోజానోను స్కానింగ్, వైద్య పరీక్షల కోసం ఆస్పత్రిలో ఉంచారు. ఆయన త్వరగా కోలుకోవాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News