Sunday, December 22, 2024

స్టయిలిష్ బీట్‌లో ‘జెస్సికా…’

- Advertisement -
- Advertisement -

శివకార్తికేయన్ కథానాయకుడిగా అనుదీప్ కెవి దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషలలో ఏకకాలంలో తెరకెక్కుతున్న పూర్తి ఎంటర్‌టైనర్ ‘ప్రిన్స్’. మారియా ర్యాబోషప్క కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రం ఇండియాలోని పాండిచ్చేరి, లండన్ నేపథ్యంలో రూపొందుతోంది. తాజాగా ఈ చిత్రం నుండి ‘జెస్సికా’ లిరికల్ వీడియోని విడుదల చేశారు. సంగీత సంచలనం తమన్ ఈ పాటని తనదైన స్టయిలిష్ బీట్‌లో డ్యాన్స్ నెంబర్‌గా కంపోజ్ చేశారు. తమన్ ఈ పాటని స్వయంగా పాడటంతో పాటు లిరికల్ వీడియోలో ఆయన కనిపించడం మరో విశేషం. తమన్ వాయిస్‌లో ఈ పాట అందరినీ అలరిస్తోంది. శివకార్తికేయన్ ఈ పాటకు చేసిన డ్యాన్స్ మూమెంట్స్ మైండ్ బ్లోయింగ్‌గా వున్నాయి. శివకార్తికేయన్, మారియా కెమిస్ట్రీ మైమరిపించింది. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Jessica Lyrical song release from ‘Prince’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News