Thursday, January 23, 2025

టైటిల్ పోరుకు జెసికా

- Advertisement -
- Advertisement -

Jessica Pegula reaches final of Madrid Open Tennis Tournament

 

మాడ్రిడ్: అమెరికా స్టార్ జెసికా పెగులా ప్రతిష్టాత్మకమైన మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరుకొంది. శుక్రవారం జరిగిన మహిళల రెండో సింగిల్స్ సెమీ ఫైనల్లో 12 సీడ్ జెసికా విజయం సాధించింది. స్విట్జర్లాండ్ క్రీడాకారిణి జిల్ టిచ్‌మాన్‌తో జరిగిన పోరులో పెగులా 63, 64 తేడాతో జయభేరి మోగించింది. ఆరంభం నుంచే జెసికా ఆధిపత్యం ప్రదర్శించింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగింది. చూడచక్కని షాట్లతో అలరించిన జెసికా ప్రత్యర్థికి కోలుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదు.

ఇక ప్రత్యర్థి క్రీడాకారిణి జిల్ తీవ్ర ఒత్తిడికి గురైంది. ఈ క్రమంలో వరుస తప్పిదాలకు పాల్పడింది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమైన జెసికా అలవోకగా తొలి సెట్‌ను దక్కించుకుంది. అయితే రెండో సెట్‌లో మాత్రం జెసికాకు కాస్త ప్రతిఘటన ఎదురైంది. ఈసారి జిల్ దూకుడుగా ఆడింది. కానీ కీలక సమయంలో జెసికా మళ్లీ పుంజుకొంది. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకుంటూ లక్షం దిశగా అడుగులు వేసింది. ఈ క్రమంలో వరుసగా రెండు సెట్లు గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. కాగా, శనివారం జరిగే తుది పోరులో 8వ సీడ్ ఓన్స్ జబియుర్‌తో జెసికా తలపడనుంది.

సెమీస్‌లో జకోవిచ్

మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) సెమీ ఫైనల్‌కు చేరుకున్నాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో జకోవిచ్ 63, 64 తేడాతో హుబర్ట్ హుర్కాజ్ (పోలండ్)ను ఓడించాడు. ఆరంభం నుంచే జకోవిచ్ దూకుడుగా ఆడాడు. చక్కని షాట్లతో ప్రత్యర్థిని హడలెత్తించాడు. ఈ క్రమంలో అలవోకగా తొలి సెట్‌ను దక్కించుకున్నాడు. రెండో సెట్‌లోనూ ఆధిపత్యం చెలాయించాడు. ఆఖరు వరకు ఆధిక్యాన్ని కాపాడుకుంటూ వరుసగా రెండు సెట్లు గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News