Monday, December 23, 2024

జెట్ ఎయిర్‌వేస్ సిఇఒ కపూర్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

ముంబై : ప్రైవేటురంగ జెట్ ఎయిర్‌వేస్ సిఇఒ సంజీవ్ కపూర్ రాజీనామా చేశారు. ఆయన 2022 ఏప్రిల్‌లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా జెట్ ఎయిర్‌వేస్‌లో చేరారు. అయితే శుక్రవారం ఆయనకు సంస్థలో చివరి రోజు అని కంపెనీ వర్గాలు తెలిపాయి. దీనిపై కపూర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. 2019 ఏప్రిల్‌లో జెట్ ఎయిర్‌వేస్ తన సేవలను నిలిపివేసింది. ఆ తర్వాత దివాలా చర్యలు ప్రారంభించారు. ఈ సంస్థను బిడ్డింగ్‌లో జలాన్ కాల్‌రాక్ కన్సార్టియం చేజిక్కించుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News