Thursday, December 26, 2024

జెట్ ఎయిర్‌వేస్ ఫౌండర్ నరేశ్ గోయల్‌కు 11 వరకు ఈడి కస్టడీ

- Advertisement -
- Advertisement -

ముంబయి: మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసిన జెట్ ఎయిర్‌వేస్ ఫౌండర్ నరేశ్ గోయల్‌కు ముంబైలోని పీఎంఎల్‌ఏ కోర్టు ఈ నెల 11 వరకు ఈడీ కస్టడీ విధించింది. ఆయన్ను ఈడీ ప్రశ్నించనున్నది. కెనరాబ్యాంకుకు చెందిన రూ.538 కోట్ల ఫ్రాడ్ కేసులో నరేశ్ గోయల్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం నరేశ్ గోయల్ (74)ను ముంబై ఆఫీసుకు విచారణకు పిలిచిన ఈడీ అధికారులు.. రాత్రి పొద్దు పోయిన తర్వాత అరెస్ట్ చేశారు. ఇంతకుముందు రెండు దఫాలు విచారణకు రావాలని నోటీసులు జారీ చేసినా నరేశ్ గోయల్ విచారణకు హాజరు కాలేదు. గత నవంబర్‌లో నరేశ్ గోయల్, ఆయన భార్య అనితా గోయల్, మరి కొందరిపై కెనరా బ్యాంకు.. లోన్ ఫ్రాడ్ విషయమై సిబిఐకి ఫిర్యాదుచేసింది. గత మే నెలలోసిబిఐ కేసు నమోదు చేసింది. దాని కొనసాగింపుగా ఈడీ కూడా మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News