Wednesday, January 22, 2025

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా జ్యువెల్ థీఫ్

- Advertisement -
- Advertisement -

తెలుగు తెరపైకి మరో సస్పెన్స్ థ్రిల్లర్ రాబోతోంది. కృష్ణసాయి, – మీనాక్షి జైస్వాల్ జం టగా నటిస్తున్న ’జ్యువెల్ థీఫ్’ సినిమా టీజర్, ఆడి యో లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్‌పై పీఎస్ నారాయణ దర్శకత్వంలో మల్లెల ప్రభాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన ’జ్యువెల్ థీఫ్’ సినిమా టీజర్, ఆడియో లాం చ్ వేడుకలో ముఖ్యఅతిథులుగా డీఐజీ అనిల్ మిం జ్, ఏపీ, తెలంగాణ ఇన్‌కమ్ టాక్స్ కమీషనర్ జీవన్ లాల్ లవిదియ, అతిథిగా నటి ఎస్తర్ పాల్గొ ని టీజర్, పాటలను విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో హీరో కృష్ణ సాయి మాట్లాడుతూ “సూపర్ స్టార్ కృష్ణ స్ఫూర్తితో సినిమాల్లోకి వచ్చాను. ’జ్యువెల్ థీఫ్… ఓ సస్పెన్స్ థ్రిల్లర్. ఈ తరం ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది”అని పేర్కొన్నారు. డైరెక్టర్ పీఎస్ నారాయణ మాట్లాడుతూ “ నా మీద నమ్మకంతో తనతో సినిమా చేయమని కృష్ణసాయి వచ్చారు. ఆయనకు తగ్గ కథను పది రోజుల్లోనే పూర్తి చేశాను. ఇది చిన్న సినిమా కాదు. అందరినీ ఆకట్టుకునే సినిమా ఇది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ మీనాక్షి జైస్వాల్, ప్రేమ, 30 ఇయర్స్ పృథ్వి, మిమిక్రి శివారెడ్డి, ఆనంద చక్రపాణి, జీవన్ లాల్ పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News