Sunday, February 23, 2025

సిరిసిల్లలో నగల ఎగ్జిబిషన్ ప్రారంభం..

- Advertisement -
- Advertisement -

సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో శనివారం మొదటిసారిగా నగల ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళచక్రపాణి, కౌన్సిలర్ శైలజ తదితరులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి నగల ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళచక్రపాణి మాట్లాడుతూ.. సిరిసిల్లలో మొదటిసారిగా జోయలుక్కాస్ సంస్థవారు మగువల మనసులకు నచ్చేలా డిజైన్ చేసిన అనేక రకాల నగల ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారని, పెద్ద పట్టణాలలో మాత్రమే ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్‌ను సిరిసిల్లలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

సిరిసిల్ల వాసవి గార్డెన్‌లో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న జోయలుక్కాస్‌వారి నగల ఎగ్జిబిషన్‌ను నగరంలోని మహిళలు సందర్శించి మనసుకు నచ్చిన నగలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News