Thursday, January 23, 2025

‘జేజీఎం’ షూటింగ్ షురూ..

- Advertisement -
- Advertisement -

యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ, స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘జేజీఎం’. బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ పాన్ ఇండియా మూవీ హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో విడుదల కాబోతోంది. ఈ చిత్రం హై వోల్టేజ్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోంది. దర్శకుడు పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. పూరీ కనెక్ట్, శ్రీకరా స్టూడియోస్ ప్రొడక్షన్‌లో ఛార్మి కౌర్, వంశీ పైడిపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిగా చేరారు. విజయ్ దేవరకొండతో పూజాకి ఇది మొదటి చిత్రం. పూజా హెగ్డే యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించబోతున్న ఈ చిత్రం మొదటి షూట్ షెడ్యూల్‌ను శనివారం ప్రారంభించారు. ఈ చిత్రం షూట్ షెడ్యూల్ ముంబయ్‌లో మొదలై పలు అంతర్జాతీయ ప్రదేశాలలో జరుగుతుంది. షూటింగ్ ప్రారంభం సందర్భంగా మేకర్స్ ప్రత్యేక వీడియోను షేర్ చేశారు. దర్శకుడు పూరి జగన్నాధ్ ఈ చిత్రంలో విజయ్ దేవరకొండను మునుపెన్నడూ చూడని పాత్రలో చూపించబోతున్నారు. పూరీ జగన్నాథ్ రచన, దర్శకత్వం వహిస్తున్న ’జేజీఎం’ వచ్చే ఏడాది ఆగస్ట్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

JGM Movie Shoot begins

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News