Saturday, November 16, 2024

మెడికల్ కాలేజీలో ఘోర అగ్నిప్రమాదం.. 10మంది చిన్నారులు మృతి

- Advertisement -
- Advertisement -

ఉత్తరప్రదేశ్‌, ఝాన్సీ జిల్లాలోని మెడికల్ కాలేజీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. చిన్న పిల్లల వార్డులో మంటలు చెలరేగడంతో దాదాపు 10 మంది పిల్లలు మరణించనినట్లు అధికారులు వెల్లడించారు. రమో16 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిపమాక సిబ్బంది, రెస్క్యూ టీమ్ హుటాహుటినా సంఘనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.NICU బయటి భాగంలో ఉన్న పిల్లలతో పాటు లోపలి భాగంలో ఉన్న కొంతమందిని రక్షించారు. గాయపడినవారిని చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ విషాద ఘటనపై ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల ఆర్థిక సాయం ప్రకటించింది.

శనివారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకున్న యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ మాట్లాడుతూ.. “ఘటనపై విచారణ జరుగుతోంది. 24 గంటల్లోగా విచారణ నివేదిక అందజేయాలని స్థానిక అధికార యంత్రాంగాన్ని ఆదేశించాం. ఈ ఘటనలో 10 మంది నవజాత శిశువులు మృతి చెందగా.. ఇందులో ఏడుగురు చిన్నారులను గుర్తించారు. ముగ్గురిని ఇంకా గుర్తించాల్సి ఉంది.. అవసరమైతే DNA పరీక్ష నిర్వహిస్తారు. ప్రాథమిక విచారణలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ లోపల షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు కనిపిస్తోంది.ఈ ఘటనలో తప్పిపోయిన వారి కోసం హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేశాం. ఈ ఘటనపై నేను స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాను. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుంది” అని పేర్కొన్నారు. కాగా, మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్‌ఐసియు)లో శుక్రవారం రాత్రి 10.45 గంటల ప్రాంతంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని జిల్లా మేజిస్ట్రేట్ (డిఎం) అవినాష్ కుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News