Monday, December 23, 2024

భార్య చికెన్ కూర వండలేదని…. ఉరేసుకున్న భర్త

- Advertisement -
- Advertisement -

లక్నో: భార్య చికెన్ కూర వండలేదని భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పవన్ అనే వ్యక్తి నాలుగు సంవత్సరాల క్రితం ప్రియాంకను పెళ్లి చేసుకున్నాడు. ఫర్నీచర్ షాప్‌లో వర్క్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భర్త మద్యానికి బానిస కావడంతో ఇద్దరు మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి.

Also Read: కశ్మీర్‌లో థియేటర్ల కళకళ

ఈ దంపతులకు రెండు సంవత్సరాల కూతురు ఉంది. భార్యను చికెన్ కూర వండాలని భర్త డిమాండ్ చేశాడు. రాత్రి భోజనం కోసం కూర చేశానని భర్తకు భార్య చెప్పింది. దీంతో ఇద్దరు మధ్య గొడవ జరగడంతో ప్రియాంక తన రూమ్‌లోకి వెళ్లి పడుకుంది. కొన్ని గంటల తరువాత ఆయన సోదరుడు పవన్ రూమ్ డోర్‌ను తట్టాడు. పవన్ నుంచి స్పందన రాకపోవడంతో కిటికీలో నుంచి చూసేసరికి అతడు ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్టుగా కనిపించాడు. పోలీసులు సహాయంతో డోర్‌ను బలవంతంగా ఓపెన్ చేశారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News