- Advertisement -
యంగ్ టైగర్ ఎన్‌టిఆర్ మరో మాస్ అండ్ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్‌కి సిద్ధం అవుతున్నారు. జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డైరెక్టర్ కొరటాల శివ మరోసారి తారక్‌తో సినిమా చేస్తున్నాడు. నందమూరి తారకరామారావు ఆర్ట్, యువ సుధ ఆర్ట్, పతాకాలపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర యూనిట్ హీరోయిన్‌ను ఫైనల్ చేసేందుకు పలు బాలీవుడ్ హీరోయిన్‌లను పరిశీస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రం కోసం బాలీవుడ్ ముద్దు గుమ్మ జాన్వీ కపూర్‌ను తీసుకొనే అవకాశం ఉంది. ఈ చిత్రం ఈ సారి పాన్ ఇండియా మూవీగా వస్తుండటంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
- Advertisement -