Wednesday, January 15, 2025

తెలుగు కంటే తమిళ్ నాకు బాగా తెలుసు: జాన్వీ

- Advertisement -
- Advertisement -

దేవర సినిమాలో జూనియర్ ఎన్‌టిఆర్ సరసన జాన్వీ కపూర్ నటించారు. ఆమెకు ఇది తొలి తెలుగు సినిమా. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా లెవల్లో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా జాన్వీ కపూర్ మీడియాతో ముచ్చటించారు. దేవర మూవీ తన తొలి తెలుగు సినిమా అని చెప్పారు. తన తల్లి శ్రీదేవి ఎక్కువగా తెలుగులో నటించిందని గుర్తు చేశారు. ఇంట్లో మాత్రం శ్రీదేవి తెలుగు, ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడడంతో అప్పుడప్పుడు చెన్నై వెళ్లడంతో తమిళ భాష కూడా వచ్చునని చెప్పారు. తెలుగు కంటే తమిళ భాష తనకు ఎక్కువగా తెలుసునని పేర్కొన్నారు. దేవర సినిమాలో నటించడం అంటే సొంత ఇంటికి వచ్చినట్లుగా అనిపించిందన్నారు. టాలీవుడ్‌లో నటిస్తుంటే మా అమ్మతో ఉన్నట్టు అనిపిస్తుందన్నారు. జాన్వీ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News