Monday, December 23, 2024

ఝార్ఖండ్ సిఎం హేమంత్ సోరెన్‌కు ఆరోసారి ఈడీ సమన్లు

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్ : ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోసారి సమన్లు పంపింది. రాంచీలో భూముల విక్రయాలు, కొనుగోలు మోసాలకు సంబంధించి మనీలాండరింగ్ కేసు విచారణ నేపథ్యంలో ఫెడరల్ ఏజెన్సీ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో హేమంత్ సోరెన్ మంగళవారం రాంచీ లోని ఏజెన్నీ జోనల్ కార్యాలయంలో ఈడీ విచారణకు హాజరయ్యే అవకాశాలున్నాయని అధికారి ఒకరు తెలియజేశారు. గతంలో ఇదే కేసు విషయమై ముఖ్యమంత్రికి ఈడీ ఐదోసారి నోటీసులు పంపింది.

ఈ నోటీస్‌లను వ్యతిరేకిస్తూ సోరెన్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఆయన మొదట సుప్రీం కోర్టును ఆశ్రయించగా, హైకోర్టు లోనే పిటిషన్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించినప్పటికీ అక్కడ ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఈడీ ఇచ్చిన నోటీసులను హేమంత్ సోరెన్ ఇంకా సవాలు చేయలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News