- Advertisement -
రాంచీ: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ బలపరీక్షలో నెగ్గారు. ఇవాళ అసెంబ్లీలో ఆయన తన మెజారిటీ నిరూపించుకున్నారు. సోరెన్‌కు అనుకూలంగా 48 మంది ఓటేశారు. బలపరీక్ష సమయంలో ప్రతిపక్ష బిజెపి సభ నుంచి వాకౌట్ చేసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హేమంత్ సోరెన్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల్లో చిచ్చుపెట్టి ప్రభుత్వాన్ని కూల్చాలని బిజెపి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దేశంలో ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో నెగ్గేందుకు అల్లర్లు సృష్టిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. జార్ఖండ్‌లో యూపిఏ ఉన్నంత వరకు ఎలాంటి కుట్రలు సాగవని సోరెన్ తెలిపారు.
Jharkhand CM Hemant Soren wins trust vote in the Assembly
(Source: Jharkhand Assembly) pic.twitter.com/eECjYxfodq
— ANI (@ANI) September 5, 2022
- Advertisement -