Sunday, December 22, 2024

రాంచీలో ప్రత్యక్షమైన జార్ఖండ్ సిఎం సోరెన్

- Advertisement -
- Advertisement -

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఎట్టకేలకు రాంచీలో ప్రత్యక్షమయ్యారు. ఆయన ఆస్తులపై ఇడి అధికారులు దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో గత 24 గంటలుగా ఆయన కనిపించకుండా పోయారు. ఆయన ఆచూకీకోసం ఇడి అధికారులు ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సోరెన్ మంగళవారం తన అధికారిక నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆయన భార్య కూడా పాల్గొనడం విశేషం.

ఇడి చర్యలను సోరెన్ తప్పుపట్టారు. బడ్జెట్ సమావేశాలకు ముందు ఇడి తనను ప్రశ్నించేందుకు సిద్ధం కావడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు అంతరాయం కలిగించేందుకు, అధికారిక విధులను నిర్వర్తించకుండా తనను  అడ్డుకునేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాల వెనుక ఉన్నవారి రాజకీయ ఎజెండాను చెప్పకనే చెబుతోందని ఆయన విమర్శించారు.

మైనింగ్ లీజులు, భూముల బదలాయింపులో సోరెన్ అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఇప్పటివరకూ ఈ కేసులలో 14మందిని అరెస్టు చేశారు. వీరిలో ఒకరిద్దరు సోరెన్ సన్నిహితులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో సోరెన్ ను అరెస్టు చేస్తే, ఆయన భార్య ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News