రాంచీ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జార్ఖండ్ మాజీ విద్యాశాఖ మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బంధు తిర్కీకి కోర్టు మూడేళ్ల జైలు శిక్షతోపాటు రూ. 3 లక్షల జరిమానా విధించింది. 2010 లో సిబిఐ తిర్కీపై కేసు నమోదు చేయగా, రాంచీ లోని సిబిఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి పీకే శర్మ కేసును విచారించి తీర్పు వెలువరించారు. శిర్కీ ఆదాయనికి మించి రూ. 6.28 లక్షలు సంపాదించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. 2009 లో సామాజిక కార్యకర్త రాజీవ్ శర్మ దిగువ కోర్టులో ఎమ్‌ఎల్‌ఎపై ఫిర్యాదు చేయగా, 2009 జులై 1 న ట్రయల్ కోర్టు విచారణకు ఆదేశించింది. 2010 ఆగస్టు1న సిబిఐ ఈ కేసు నమోదు చేసింది. ప్రాసిక్యూషన్ తరఫున 21 మంది, డిఫెన్స్ తరఫున 8 మంది సాక్షులను ప్రత్యే సిబిఐ కోర్టులో విచారించారు. మందార్ ఎమ్‌ఎల్‌ఎగా 2005 నుంచి 2009 జూన్ వరకు బంధుతిర్కీ రూ.6.28 లక్షల ఆదాయానికి మించి సంపాదించినట్టు సిబీఐ విచారణలో తేలింది.