Friday, December 20, 2024

మాజీ బిజెపి మంత్రులపై ఎసిబి దర్యాప్తు..

- Advertisement -
- Advertisement -

రాంచి: జార్ఖండ్‌లో ఇదివరకటి బిజెపి ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన కొందరు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ఎసిబి దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర అసెంబ్లీ భవనం, కొత్త హైకోర్టు భవనం నిర్మాణాలకు అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై ఈ ఏడాది మేలో జుడిషియల్ విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రభుత్వం తాజాగా మాజీ మంత్రులపై ఎసిబి దర్యాప్తునకు ఆదేశించడం సంచలనం సృష్టించింది. బిజెపి పాలనలో 2016లో రాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవంలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చిన దరిమిలా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎసిబి దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. మాజీ మంత్రులు నీరా యాదవ్, రణధీర్ కుమార్ సింగ్ నీల్‌కంఠ్ సింగ్ ముండా, అమర్ కుమార్ బౌరి, లూయిస్ మరాండి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Jharkhand Govt Order ACB probe against Ex BJP Ministers

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News