రాంచీ: తలను గుర్తించిన 36 గంటల తరువాత తొమ్మిది కిలో మీటర్ల దూరంలో మొండాన్ని గుర్తించిన సంఘటన ఝార్ఖండ్ రాష్ట్రం హజరీబాగ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పద్మా పోలీస్ స్టేషన్ పరిధిలో మొండెం లేని తల కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తలను స్వాధీనం చేసుకున్నారు. మొండెం కోసం ఎక్కడ వెతికినా కనిపించలేదు. ఇచాక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోట్వా అటవీ ప్రాంతంలో 36 గంటల తరువాత తొమ్మిది కిలో మీటర్ల దూరంలో మొండాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హజారీబాగ్ జిల్లాలో అదృశ్యమైన వ్యక్తుల వివరాలను సేకరిస్తున్నారు. మొండాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తలను షేక్ భిఖారీ మెడికల్ కాలేజీ-ఆస్పత్రికి తరలించారు.
Also Read: ఎనిమిది మందిని పెళ్లాడిన యువతి..ఆతర్వాత