Saturday, December 21, 2024

రాహుల్ గాంధీపై రాంచీ కోర్టు ఇచ్చిన నోటీసుపై జార్ఖండ్ హైకోర్టు స్టే పొడిగింపు!

- Advertisement -
- Advertisement -

రాంచీ: బిజెపి నేత అమిత్ షాను కించపరిచారంటూ దాఖలైన కేసులో వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ స్థాని జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ జారీ చేసిన నోటీసుపై జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం స్టే పొడగించింది. రాంచీలోని మెజిస్టీరియల్ కోర్టు తనపై ప్రారంభించిన క్రిమినల్ ప్రొసీడింగ్‌లను రద్దు చేయాలంటూ రాహుల్ గాంధీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ అంబుజ్ నాథ్, కోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు రాహుల్ గాంధీపై ఎటువంటి బలవంతపు చర్యలు చేపట్టరాదని ఆదేశించారు.

మరుసటి రోజు రాంచీలోని మెజిస్ట్రేట్ కోర్టు ముందు రాహుల్ గాంధీ హాజరు కావాలన్న నోటీసుపై ఫిబ్రవరి 3న హైకోర్టు మొదట స్టే విధించింది. రాంచీలోని బిజెపి సభ్యుడు నవీన్ ఝా తనపై దాఖలు చేసిన ఫిర్యాదు కేసులో మెజిస్ట్రేట్ ముందు హాజరు కావాలని ఆదేశించింది. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు చైబాసాలో చేసిన ప్రసంగంలో బిజెపి నాయకుడు అమిత్ షాను రాహుల్ గాంధీ దూషించారని నవీన్ ఝా తన పిటిషన్‌లో ఆరోపించారు. ఝా గత ఏడాది ఏప్రిల్ 24న రాంచీ సబ్ డివిజనల్ జ్యుడీసియల్ మెజిస్ట్రేట్ కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కోర్టు కొట్టివేసింది.

దాంతో ఝా రాంచీ జ్యుడీషియల్ కమిషనర్ కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. దానిని అనుమతించారు. మళ్లీ సబ్‌డివిజినల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌కు దానిని అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News