Sunday, December 22, 2024

భూ కుంభకోణం కేసులో హేమంత్ సోరేన్ కు బెయిలు

- Advertisement -
- Advertisement -

రాంచీలోని బిర్సా ముండా జైలులో హేమంత్ సోరేన్ ఉన్నారు

రాంచీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ కు జార్ఖండ్ హైకోర్టు భూ కుంభకోణం కేసులో బెయిలు మంజూరు చేసింది. ఇదిలావుండగా ఆయన తరఫు లాయర్ అరుణభ్ చౌదరి కోర్టు ఆయన ఎలాంటి అపరాధం చేయలేదని భావించిందన్నారు. సోరేన్ పెట్టుకున్న బెయిల్ పై హైకోర్టు జూన్ 13 నిర్ణయాన్ని నిలిపి ఉంచింది.

ప్రస్తుతం హేమంత్ సోరేన్ రాంచీలోని బిర్సాముండా జైలులో ఉన్నారు. ఆయన జార్ఖండ్ ముక్తి మోర్చా(జెఎంఎం) కార్యనిర్వాహక అధ్యక్షుడు. సోరేన్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడి) జనవరి 31న అరెస్టు చేసింది. ఇదిలావుండగా ఈడి తరఫు న్యాయవాది ఎస్. వి. రాజు మాత్రం హేమంత్ సోరేన్ భూ అక్రమాలకు పాల్ప డ్డారని సాక్షులు ధ్రువీకరించారని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News