Monday, January 6, 2025

పెళ్లి చేసుకోమన్నందుకు ప్రియురాలిని 40 ముక్కలుగా నరికిన ప్రియుడు

- Advertisement -
- Advertisement -

చెన్నై: ప్రియురాలి పెళ్లి చేసుకోమని బలవంతం చేయడంతో ఆమెను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసి అనంతరం మృతిదేహాన్ని ప్రియుడు 40 నుంచి 50 ముక్కలుగా నరికి పడేసిన సంఘటన తమిళనాడు రాష్ట్రం జరియగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నిందితుడు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఝార్ఖండ్ రాష్ట్రం కుంతి జిల్లాకు చెందిన నరేష్ భేంగ్రా తమిళనాడులోని జరియగఢ్‌లో మటన్ షాపులో పని చేస్తున్నాడు. తమిళనాడుకు చెందిన యువతితో సహజీవనం చేస్తున్నాడు. ఆమె గత కొన్ని రోజుల పెళ్లి చేసుకోవాలని నరేష్‌ను బలవంతం చేస్తుంది. ఇదే సమయంలో ఝార్ఖండ్‌కు వెళ్లి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు.

అనంతరం ఒంటరిగా తమిళనాడుకు వచ్చి ప్రియురాలును కలిసి అనంతరం ఆమెను జోర్డాగ్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. తనకు పెళ్లి జరిగిందని ప్రియురాలిని పెళ్లి చేసుకోనని చెప్పడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో ఆమె గొంతు నులిమి చంపాడు. అనంతరం మృతదేహాన్ని 40 నుంచి 50 ముక్కలుగా నరికి పడేశాడు. అనంతరం ఝార్ఖండ్‌కు వెళ్లి తన భార్యతో నరేష్ కలిసి ఉన్నాడు. శరీర భాగాలను కుక్కలు పీక్కు తినడంతో గ్రామస్థులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలంలో యువతి ఆధార్ కార్డు లభించడంతో ఆమె తల్లికి పోలీసులు సమాచారం ఇచ్చారు. దుస్తులను గమనించి ఆమె తన కూతురేనని గుర్తించింది. నరేష్‌తో తన కూతురు ప్రేమాయణం నడిపిస్తుందని అతడిపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆ కోణంలో విచారణ ప్రారంభించారు. నరేష్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News