Friday, December 20, 2024

బాలిక హత్యకు దారితీసిన టీనేజ్ ప్రేమ

- Advertisement -
- Advertisement -

 

గొడ్డ(జార్ఖండ్): తాను ప్రేమించిన అమ్మాయి మరో అబ్బాయితో ఫోన్‌లో చాటింగ్ చేయడాన్ని చూసి భరించలేక ఒక 17 ఏళ్ల బాలుడు ఆమెను హత్య చేశాడు. ఆ బాలిక మృతదేహం జార్ఖండ్‌లోని గొడ్డ జిల్లాలో పంట పొలాలలో గురువారం ఉదయం లభించినట్లు పోలీసులు శనివారం తెలిపారు. ఆ బాలిక హోలీ పండుగ నుంచి కనిపించడం లేదని వారు చెప్పారు. ఉర్జానగర్‌లోని ఒక కార్పొరేట్ ఇంగ్లీష్ మీడియం స్కూలులో ఆ బాలుడు, బాలిక కలసి చదువుకున్నారని పోలీసులు చెప్పారు.

వారిద్దరూ ప్రేమించుకుంటున్నారని, అయితే ఆ బాలిక ఇన్‌స్టాగ్రామ్‌లో వేరే బాలుడితో చాటింగ్ చేయడం చూసి భరించలేక బుధవారం సాయంత్రం హోలీ వేడుకలు జరుపుకునేందుకు తన మిత్రురాలి ఇంటికి వెళుతున్న ఆ బాలికను ఇనుప రాడ్‌తో తలపై కొట్టి ఆ బాలుడు చంపివేశాడని పోలీసులు వివరించారు. ఇంటరాగేషన్‌లో తాను చేసిన నేరాన్ని బాలుడు అంగీకరించాడని జిల్లా ఎస్‌పి నాథూసింగ్ మీనా తెలిపారు. బాలికను చంపేందుకు ఉపయోగించిన ఇనుప రాడ్‌ను, బాలిక మొబైల్ ఫోన్‌ను మృతదేహం లభించిన ప్రదేశానికి కొద్ది దూరంలో దొరికాయని ఆయన చెప్పారు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News