Sunday, January 19, 2025

పొరపాటున ఖాతాలోకి రూ.1 లక్ష…జార్ఖండ్ వ్యక్తి అరెస్టు!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సింఘ్‌భమ్ జిల్లాకు చెందిన బీడి కార్మికుడు జీత్‌రాయ్ సమంత్(42) రెండేళ్ల కిందట డబ్బు విత్ డ్రా చేసేప్పుడు పొరపాటున ఓ మహిళ బ్యాంకు ఖాతా అతడి ఆధార్ నంబర్‌కు లింక్ అయింది. అయితే డ్రా చేసిన ఆ డబ్బును తిరిగి చెల్లించమని అడిగినప్పుడు అతడు చెల్లించలేదు. దాంతో అతడిని మార్చి 24న పోలీసులు అరెస్టు చేశారు.
జార్ఖండ్ రాజ్య గ్రామీణ బ్యాంకు మేనేజర్‌కు 2022 సెప్టెంబర్‌లో శ్రీమతి లగురి ఓ ఫిర్యాదు చేసింది. తన ఖాతా నుంచి డబ్బు పోయిందని పేర్కొంది. ఆధార్ లింకింగ్‌లో తప్పు జరిగిందని అధికారులు గుర్తించారు. సమంత్‌ను డబ్బు తిరిగి చెల్లించమని అధికారులు అడిగారు. కానీ అతడు ఇవ్వలేదు. దాంతో అతడికి వ్యతిరేకంగా ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. పోలీస్ స్టేషన్‌లో ఐపిసి 406, 420 సెక్షన్ల కింద అతడిపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. సమంత్ డబ్బు విత్‌డ్రా చేసేప్పుడు ఖాతాదారు పేరును చూసినప్పటికీ దానిని పట్టించుకోకుండా డబ్బు విత్ డ్రా చేశాడని పోలీసులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News