Monday, January 20, 2025

జూదం… భార్యను గన్ తో కాల్చిన భర్త

- Advertisement -
- Advertisement -

రాంచీ: జూదం ఆడొద్దని భర్తకు భార్య చెప్పినందుకు ఆమెను గన్ తో కాల్చి అతడు పారిపోయిన సంఘటన ఝార్ఖండ్ రాష్ట్రం లలోహర్దాగా ప్రాంతంలో జరిగింది. పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సిన్హ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్ కోపా గ్రామంలో ప్రమోద్ ప్రసాద్(33), ఉజ్జ్వాలా దేవీ(28) నివసిస్తున్నారు. ప్రమోద్ ప్రసాద్ జూదం ఆడడంతో పెద్ద మొత్తంలో డబ్బులు కోల్పోయాడు. దీంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. జూదంతో ఆడడంతో ఇంట్లో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో భార్యభర్తల మధ్య ప్రతీ రోజు గొడవలు జరుగుతున్నాయి. డబ్బుల విషయంలో భర్తను భార్య ప్రశ్నించడంతో గన్ తీసుకొని ఆమెపై మూడు సార్లు కాల్పులు జరిపాడు. అక్కడ నుంచి ప్రమోద్ తప్పించుకున్నాడు. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. ప్రమోద్ ను 24 గంటల్లోపు పోలీసులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News