ప్రేమను నిరాకరించిందని
యువతిపై పెట్రోలు పోసి నిప్పు పెట్టిన యువకుడు
రాంచీ : ప్రేమను నిరాకరించిందన్న కారణంతో నిద్రిస్తున్న యువతిపై పెట్రోలు పోసి నిప్పంటించి దారుణంగా హతమార్చాడు ఓ యువకుడు. ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న నిందితుడు చిరునవ్వులు చిందిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో ఈ ఘోరం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. దుమ్కాకు చెందిన 19 ఏళ్ల బాలిక 12వ తరగతి చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన షారూక్ అనే యువకుడు ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. అతడి ప్రతిపాదనను ఆమె తిరస్కరించడంతో గత మంగళవారం ఆమె నిద్రిస్తున్న సమయంలో కిటికీ బయట నుంచి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 90 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఆమె అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. విషయం వెలుగులోకి రావడంతో దుమ్కాలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఆమెకు న్యాయం చేయాలని వివిధ సంఘాలు ఆందోళనకు దిగారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో రంగంలోకి దిగిన పోలీసులు దుమ్కాలో 144 సెక్షన్ విధించారు. మరోవైపు బాలిక కుటుంబానికి సిఎం సోరెన్ రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఆమె కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.
#WATCH | Jharkhand: Accused Shahrukh who set ablaze a class 12 girl in Dumka for allegedly turning down his proposal, was arrested on 23rd August.
The girl succumbed to her burn injuries yesterday, 28th August.
(In video: The accused from the day of his arrest – 23rd August) pic.twitter.com/PwkQuM8plt
— ANI (@ANI) August 29, 2022