Monday, December 23, 2024

మహిళపై ఎస్‌పి, డిసిపి డ్రైవర్లు అత్యాచారం…

- Advertisement -
- Advertisement -

రాంఛీ: ఎస్‌పి, డిసిపి డ్రైవర్లు ఓ మహిళను రూమ్ తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేసిన సంఘటన ఝార్ఖండ్‌లోని పాలము జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పాలము డిప్యూటీ కమిషనర్ శశిరంజన్ వద్ద ధర్మేంద్ర కుమార్ అనే వ్యక్తి ఎస్కార్ట్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పాలము జిల్లా ఎస్‌పి రీష్మా రమేషన్ వద్ద ప్రకాశ్ కుమార్ విధులు నిర్వహిస్తున్నాడు. మొబైల్ రీఛార్జ్ కోసం ఓ మహిళ దోల్టన్‌గంజ్ రైల్వే స్టేషన్ నుంచి ఓ షాపుకు వచ్చింది. అదే సమయంలో ధర్మేంద కుమార్, ప్రకాశ్ కుమార్ అక్కడే ఉన్నారు. అనారోగ్యం పాలు కావడంతో మెడినినగర్‌లో ఆస్పత్రికి వెళ్తున్నానని చెప్పింది. తాము అక్కడికే వెళ్లాలి తీసుకెళ్తామని వారు చెప్పడంతో నమ్మి ఇద్దరుతో వెళ్లింది. రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉన్న రూమ్‌కు ఆమెను తీసుకెళ్లి ఇద్దరు అత్యాచారం చేశారు. సదరు మహిళ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News