Thursday, January 23, 2025

మహిళతో జార్ఖండ్ మంత్రి అశ్లీల సంభాషణ: బయటపెట్టిన బిజెపి ఎంపి(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: జార్ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి బన్నా గుప్తా ఒక మహిళతో సాగించిన అశ్లీల సంభాషణలకు సంబంధించినట్లు చెబుతున్న వీడియోను బిజెపి ఎంపి నిషికాంత్ దుబే సోమవారం సోషల్ మీడియాలో బయటపెట్టారు. తన ప్రతిష్టను డెబ్బతీయడానికి తన రాజకీయ ప్రత్యర్థులు దీన్ని ఎడిటింగ్ చేసిన నకిలీ వీడియోగా గుప్తా అభివర్ణించారు. ఇది తనపై చేసిన కుట్రలో భాగమని, పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు. ఈ వీడియో ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, పోలీసులు దీన్ని దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటారని గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. తనను ఇరికించడానికి ప్రయత్నించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు.

19 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోను బిజెపి ఎంపి దుబే తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. ఇదీ కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం.. ఇదీ జార్ఖండ్ ఆరోగ్య మంత్రి బన్నా గుప్తాజీకి సంబంధించిన వ్యవహారం. సునీల్ శర్మ అనే కాంగ్రెస్ కార్యకర్త తన భార్యను కుంపట్లో కాలుస్తాడు..కాంగ్రెస్ కుటుంబం దీన్ని అర్థం చేసుకుంటుందని ఆశిస్తున్నా..ఈ వీడియో నిజమైనదైతే కాంగ్రెస్ పార్టీ సిగ్గుతో చచ్చిపోవాలి అంటూ బిజెపి ఎంపి దుబే ట్వీట్ చేశారు. ఒక ప్రైవేట్ న్యూస్ పోర్టల్ నుంచి ఈ వీడియో తనకు అందినట్లు గొడ్డా నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపి దుబే చెప్పారు. అయితే ఈ వీడియో నివాస్తవికత నిర్ధారణ కాలేదు. జార్ఖండ్‌లో జెఎంఎం భాగస్వామ్యంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News