Monday, January 20, 2025

ఇడి ని వాడుకుంటూ సాగే సర్కారు:ఎంపి హన్స్‌దక్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : బిజెపి ప్రభుత్వం కేవలం ఇడి, ఐటి వంటి సంస్థలను వాడుకునే సాగుతున్నాయని లేకపోతే వారు ఎన్నికలలో గెలవలేరని జార్ఖండ్ ఎంపి హన్స్‌దక్ విమర్శించారు. ప్రత్యర్థులను బెదిరించేందుకు ఇడిని ఉసిగొల్పుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరితో దేశంలో ఆర్థిక పరిస్థితి చిక్కుల్లో పడిందని తెలిపారు. ఇక దీనిపై శ్వేతపత్రంతో ప్రయోజనం ఏముందని ప్రశ్నించారు. దీనిపై బిజెపి ఎంపి సంజయ్ జైస్వాల్ స్పందిస్తూ యుపిఎ హయాంలో ఆర్థిక అవినీతి మితిమీరిందని తెలిపారు. కొందరు రుణాలు తీసుకోవడం ఎగ్గొట్టడం ఆనవాయితీ చేసుకున్నారని విమర్శించారు. దీనిని తమ ప్రభుత్వం అరికట్టిందని తెలిపారు.

మజ్లిస్ ఎంపి అసదుద్దిన్ ఒవైసీ మాట్లాడుతూ శ్వేతపత్రం కేవలం ప్రగాల్బాలు తప్పితే ఎటువంటి పసలేనిదని మండిపడ్డారు. యుపిఎ పది సంవత్సరాల కాలంలో వృద్ధి రేటు 6.8 శాతం దాటింది. మరి ఎన్‌డిఎ కాలంలో ఎందుకు 5.9 శాతానికి దిగజారిందో చెపుతారా? అని నిలదీశారు. ఐయుఎంఎల్ సభ్యులు ఇటి మెహమ్మద్ బషీర్ మాట్లాడుతూ ఈ పత్రం కేవలం బిజెపిది. బిజెపి యొక్క ఎన్నికల కొరకు తెచ్చిన శ్వేతపత్రం అని చెప్పారు. కాంగ్రెస్ సారధ్య యుపిఎ హయాంలో పలు కీలక ప్రజోపయోగ చట్టాలు తీసుకువచ్చారు. సమాచార హక్కు (ఆర్టీఐ), విద్యాహక్కు, ఉపాధి హామీ పథకం వంటి పలు పథకాలు ప్రజలకు మేలు చేశాయని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News