Thursday, January 23, 2025

జార్ఖండ్ లో కోర్టును ఆశ్రయించిన ముస్లిం యువతి

- Advertisement -
- Advertisement -

Jharkand High Court order

రాంచీ: జార్ఖండ్ హైకోర్టు బుధవారం ముస్లిం యువతి(26)కి రక్షణ ఇవ్వమని పోలీసులను ఆదేశించింది. ఆమె తల్లిదండ్రులు ఆమె వయస్సుకు రెట్టింపు ఉన్న వ్యక్తితో(52) పెళ్లి నిశ్చయించారు. కాగా ఆ యువతి ఓ హిందూ యువకుడిని ప్రేమించింది. ఈ నేపథ్యంలో ఆమె కోర్టును ఆశ్రయించగా కోర్టు ఈ ఆదేశాన్ని జారీ చేసింది. కోర్టుకు చేసిన ఫిర్యాదులో ఆ యువతి తన తల్లిదండ్రులు తనకు సంబంధం చూశారని, తనని తన సోదరి ఇంట్లో నిర్బంధించారని పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తి ఎస్‌కె ద్వివేది కేసును విచారించి ప్రతి ఒక్కరికి రాజ్యాంగం రక్షణ కల్పిస్తుందన్నారు. ఆమెకు తనకు నచ్చిన వ్యక్తిని వివాహమాడే స్వేచ్ఛ ఉందన్నారు. ఆమె ప్రేమించింది మరో మతానికి చెందిన వ్యక్తినని కనుక రెండు సముదాయాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉన్నందున రక్షణ ఇవ్వాలని ఆయన పోలీసులను ఆదేశించారు. రాంచీ పోలీస్ చీఫ్‌కు కోర్టు ఆదేశాలు జారీచేశారు. ఆమెకు ఇష్టం లేకుండా ఆమె తల్లిదండ్రులు ఆమెకు వేరొకరితో వివాహం చేసే అధికారం లేదని కూడా కోర్టు స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News