Tuesday, January 21, 2025

జార్ఖండ్‌లో ఎన్డీఏకే విజయావకాశాలు

- Advertisement -
- Advertisement -

ఖనిజ సంపదకు నిలయమైన జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఎన్డ్డీఏ, ‘ఇండియా’ కూటములకు ప్రతిష్టాత్మకంగా మారాయి. 24 జిల్లాలు, ఐదు డివిజన్లు ఉన్న జార్ఖండ్‌లో 81అసెంబ్లీ స్థానాలున్నాయి. ఉత్తర భారత దేశంలోనే అధికంగా ఆదివాసీల ప్రాబల్యం ఉన్న రాష్ట్రం జార్ఖండ్. జెఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐఎమ్‌ఎల్ పార్టీలతో కూడిన ‘ఇండియా’ కూటమి, బిజెపి, ఎజెఎస్‌యు, జేడీ(యూ), ఎల్‌జిపి పార్టీలతో కూడిన ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో పోటాపోటీగా తలపడ్డాయి. జార్ఖండ్‌లో ప్రస్తుతం జెఎంఎం నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. రాష్ట్ర శాసనసభ ఎన్నికలపై క్షేత్రస్థాయిలో పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ఎగ్జిట్ పోల్ నిర్వహించింది.

ఎగ్జిట్ పోల్‌లో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ జార్ఖండ్‌లో అధికారం చేపట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 81 శాసనసభ స్థానాలున్న జార్ఖండ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ సీట్లు 41. బిజెపి (42 నుండి 48స్థానాలు), ఎజెఎస్‌యు (25), కాంగ్రెస్ (814), జెఎంఎం (1623), ఇతరులు (610) స్థానాలు పొందే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్ సర్వేలో తేలింది.
పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాల ప్రకారం బిజెపి 42.1 శాతం, ఎజెఎస్‌యు 4.6 శాతం, కాంగ్రెస్ 16.2 శాతం, జెఎంఎం 20.8 శాతం, ఇతరులు 16.3 శాతం ఓట్లు పొందనున్నాయి. ఈ సర్వే ఫలితాల్లో మూడు శాతం ప్లస్ ఆర్ మైనస్ ఉండే అవకాశాలున్నాయి.

రాష్ట్రంలో డివిజన్ల వారీగా పార్టీల బలాబలాలను అంచనా వేస్తే.. కొల్హాన్ డివిజన్‌లో 2019 ఎన్నికల్లో జెఎంఎం ఆధిక్యత సాధించగా, ప్రస్తుతం బిజెపి మెరుగ్గా కనిపిస్తున్నా ‘ఇండియా’ కూటమి ఇక్కడ గట్టి పోటీ ఇచ్చింది. బొగ్గు మైనింగ్ అధికంగా ఉండే నార్త్ చోటా నాగపూర్‌లో ఎస్సీ జనాభా అధికం. ఇక్కడ వామపక్షాలకు కొంత బలమున్నా, పట్టణ ప్రాంతాల్లో బిజెపికి సానుకూలంగా ఉంది. కుర్మి సామాజికవర్గం ఇక్కడ అధికంగా ఉండడంతో ఎజెఎస్‌యు కూడా బలంగానే ఉంది. సిపిఐఎంఎల్ ఇక్కడ కీలకం కావడంతో, ఈ ప్రాంతంలో రెండు కూటముల మధ్య గట్టి పోటీ ఉంది. సౌత్ చోటా నాగపూర్ రీజియన్‌లో రాజధాని రాంచీ కీలకం. ముండా, ఓరన్‌లో ఎస్టీలు, లోహర్‌గడ్‌లో ముస్లింలు, సిండేగాలో క్రిస్టియన్ల ప్రభావం ఉంది. రాంచీ, గుమ్లా జిల్లాలో బిజెపికి సానుకూలంగా ఉండగా, ఈ ప్రాంతంలోని ఇతర జిల్లాల్లో పోటాపోటీగా ఉంది. ఓబిసిలు అధికంగా ఉండే పాలాం ప్రాంతంలో గతంలో బిజెపి మెరుగైన ఫలితాలు పొందింది. ఈ సారి కూడా అదే పునరావృత్తమయ్యే అవకాశాలున్నాయి. సంతాల పర్గాన ప్రాంతంలో గతంలో బిజెపికి అనుకూల ఫలితాలు రాలేదు.

ఈ సారి మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి.
ఎస్టీ సామాజికవర్గంలో సంతాల వర్గం కీలకం. సీఎం హేమంత్ సోరెన్, బిజెపి సీనియర్ నేత బాబులాల్ మరాండీ సంతాల వర్గానికే చెందిన వారు. ప్రస్తుతం ఈ సామాజికవర్గంలో బిజెపితో పోలిస్తే జెఎంఎంకు కొంత అనుకూలంగా ఉంది. ముండా సామాజికవర్గం బిజెపి వైపు ఉండగా, ఓరన్ సామాజికవర్గం బిజెపి, కాంగ్రెస్ మధ్య చీలిపోయి ఉంది. హో సామాజికవర్గం బిజెపికి అనుకూలంగా ఉంది. ఎస్సి సామాజికవర్గంలో పాశ్వాన్, బోక్తా వర్గాలు బిజెపికి అనుకూలంగా ఉండగా, చమర్ వర్గం ‘ఇండియా’ కూటమి వైపు ఉంది. ఓబిసిలో కుర్మి సామాజికవర్గం కీలకం. గతంలో వీరు జెఎంఎంకు అనుకూలంగా ఉండగా, ప్రస్తుతం ఎజెఎస్‌యు వైపు ఉన్నారు. మరో సామాజికవర్గం బనియా బిజెపి వైపు ఉన్నారు. యాదవులు ఎన్‌డిఎ, ‘ఇండియా’ కూటమి మధ్య చీలి ఉన్నారు. 14 శాతంపైగా ఉన్న ముస్లింలు, 4 శాతంపైగా ఉన్న క్రిస్టియన్లు ‘ఇండియా’ కూటమికి అనుకూలంగా ఉన్నారు. అగ్రవర్ణాల్లో బ్రాహ్మణులు, రాజపుత్రులు, కాయస్తులు బిజెపికి అనుకూలంగా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News